
తాజా వార్తలు
రోహిత్ మరో రెండు పరుగులు చేసి ఉంటే..
కోహ్లీ-వార్నర్ తర్వాత రోహిత్-అయ్యరే..
ఇంటర్నెట్‌డెస్క్: దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి దిల్లీతో జరిగిన 13వ సీజన్ ఫైనల్లో ముంబయి సారథి రోహిత్ శర్మ(68) మరో రెండు పరుగులు చేసి ఉంటే ఒక రికార్డును తన ఖాతాలో వేసుకునేవాడు. టీ20 లీగ్ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్(69) 2016లో రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఏ సీజన్లోనూ ఏ కెప్టెన్ కూడా ఫైనల్లో ఇంతకు మించి పరుగులు చేయలేదు. ఈ నేపథ్యంలోనే రోహిత్ తాజా మ్యాచ్‌లో మరో రెండు పరుగులు చేసి ఉంటే వార్నర్‌ని అధిగమించేవాడు. కానీ, అతడి కన్నా ఒక పరుగు తక్కువకే ఔటై ఆ అవకాశాన్ని కోల్పోయాడు.
ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ చివరి క్షణాల్లో ఔటైనా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో కలిసి ఇషాన్ కిషన్(33*) జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. దాంతో ముంబయి 5 వికెట్ల తేడాతో గెలుపొందడమే కాకుండా ఐదోసారి టైటిల్ గెలిచిన జట్టుగా ఛాంపియన్‌గా నిలిచింది. మరోవైపు ఇదే మ్యాచ్‌లో దిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(65) అర్ధశతకం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో 2016 తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో ఇద్దరు కెప్టెన్లు అర్ధ శతకాలు సాధించడం ఇదే తొలిసారి. మొత్తంగా చూసినా ఇది రెండోసారి మాత్రమే. 2016లో బెంగళూరుతో తలపడిన సందర్భంగా హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (69) పరుగులు చేయగా ఛేదనలో విరాట్ కోహ్లీ(54) పరుగులు చేశాడు. దాంతో కోహ్లీ-వార్నర్‌ల తర్వాత ఫైనల్లో రోహిత్-శ్రేయస్ మాత్రమే అర్ధశతకాలు సాధించిన కెప్టెన్లుగా నిలిచారు.
ఇవీ చదవండి:
ఫ్రీ హిట్‌కు రనౌట్.. అంపై‘రాంగ్’.. తలా రీఎంట్రీ
5స్టార్ కెప్టెన్.. రాహుల్ రైడ్.. బౌల్ట్ బుల్లెట్స్.. 4 సూపర్స్