close

తాజా వార్తలు

Updated : 11/08/2020 08:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పనిలోంచి తీసేశాడని యజమాని ఇంటికే కన్నం

● డ్రైవర్‌, తోటమాలి సహా ఐదుగురి అరెస్ట్‌


పట్టుబడిన అయిదుగురు నిందితులు

హైదరాబాద్‌: పనిలోంచి తీసేశాడని యజమానిపై కక్ష పెంచుకున్న ఓ డ్రైవర్‌, తోటమాలి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆయన ఇంటికే కన్నం వేశారు. రూ.1.29 కోట్ల నగదు కాజేశారు. 10 రోజుల పాటు శ్రమించిన పోలీసులు నిందితులను సోమవారం అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గోల్కొండ ఠాణా పరిధిలోని బాల్‌రెడ్డినగర్‌లో స్థిరాస్తి వ్యాపారి అసదుద్దీన్‌ అహ్మద్‌ నివసిస్తున్నాడు. టోలీచౌకీలో ఉంటున్న మహ్మద్‌ అఫ్సర్‌, మిరాజ్‌ అష్వాక్‌ అసదుద్దీన్‌ వద్ద డ్రైవర్‌, ఫాంహౌస్‌లో తోటమాలిగా పని చేస్తుండేవారు. రెండేళ్ల క్రితం ఇద్దరినీ పనిలోంచి తొలగించగా.. యజమానిపై కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా నష్టం కలిగించాలనుకున్నారు. మిలిటరీ క్వార్టర్స్‌లో నివసిస్తున్న స్నేహితులు రెహమాన్‌బేగ్‌, మహ్మద్‌ అమీర్‌, సయ్యద్‌ ఇమ్రాన్‌కు చెప్పగా.. ఇంట్లో చోరీ చేయడం సులభమని చెప్పారు. యజమాని ఇంట్లో నగలు, డబ్బు ఎక్కడుంటాయో ముందే తెలియడంతో మహ్మద్‌ అఫ్సర్‌, మిరాజ్‌ అందే చేద్దామని నిర్ణయించారు.

అసదుద్దీన్‌ కదలికలపై నిఘా..

బక్రీద్‌ పండగకు 10 రోజుల ముందు అసదుద్దీన్‌ శామీర్‌పేటలోని ఫామ్‌హౌస్‌కు వెళ్తాడని, ఆ సమయం అనువుగా ఉంటుందని భావించారు. గతనెల 22న అర్ధరాత్రి మహ్మద్‌ అఫ్సర్‌, మిరాజ్‌, రెహమాన్‌, అమీర్‌, ఇమ్రాన్‌ రెండు బైక్‌లపై అసదుద్దీన్‌ ఇంటికెళ్లారు. బయట ముగ్గురు ఉండగా.. అఫ్సర్‌, మిరాజ్‌ తలుపు పగులగొట్టి బీరువాలోని రూ.1.29 కోట్లను సంచుల్లో తీసుళ్లి రెహమాన్‌ ఇంట్లో దాచారు. కొంత డబ్బు తీసుకొన్నారు. ఓ బైక్‌ కొనుగోలు చేశారు. గతనెల 23న అసదుద్దీన్‌ ఫామ్‌హౌస్‌ నుంచి ఇంటికొచ్చాడు. తలుపు బద్దలై ఉండటం గమనించి బీరువాలో చూశాడు. నగదు అపహరణకు గుర్తించాడు. రూ.2.50కోట్లు దొంగిలించారంటూ గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ కెమెరాలు, చరవాణుల ఆధారంగా మహ్మద్‌ అఫ్సర్‌, మిరాజ్‌ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను సోమవారం అరెస్టు చేశామని సంయుక్త కమిషనర్‌ ఎ.ఆర్‌.శ్రీనివాస్‌ తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన