ఆరు నిమిషాల సీన్‌.. రూ.6 కోట్లు..!

తాజా వార్తలు

Published : 11/05/2020 00:44 IST

ఆరు నిమిషాల సీన్‌.. రూ.6 కోట్లు..!

‘పుష్ప’ లేటెస్ట్‌ అప్‌డేట్‌

హైదరాబాద్‌: ‘పుష్ప’ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశం కోసం భారీ బడ్జెట్‌ కేటాయించారు. ఇందులోని ఆరు నిమిషాల సన్నివేశం కోసం రూ.6 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సీన్‌ సినిమాలోనే హైలైట్‌గా నిలుస్తుందని పేర్కొంది. అంతేకాదు ఈ సినిమా కోసం కేవలం భారత్‌ కళాకారులు మాత్రమే పనిచేయబోతున్నారు. ఇది మేడిన్‌ ఇండియా ప్రాజెక్టని, భారత్‌లోని కళాకారులకు ఉపాధి కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని యూనిట్‌ పేర్కొంది.

‘అల వైకుంఠపురములో..’ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ నటిస్తున్న సినిమా ఇది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయిక. ప్రకాశ్‌రాజ్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, వెన్నెల కిశోర్‌, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నారట. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత బన్నీ-సుక్కు-దేవిశ్రీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని