close

తాజా వార్తలు

Published : 21/09/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రామ్‌నాథ్‌జీ.. ఆ బిల్లులను ఆమోదించొద్దు

చండీగఢ్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు ఆమోదముద్ర వేయొద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ కోరారు. రెండు వ్యవసాయ బిల్లులు పార్లమెంట్‌ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆ బిల్లులను వెనక్కి పంపాలని రాష్ట్రపతిని కోరారు.

‘‘రైతులకు సంబంధించిన బిల్లులపై సంతకం చేయొద్దని రాష్ట్రపతిని కోరుతున్నా. వాటిని పునః పరిశీలన నిమిత్తం పార్లమెంట్‌కు పంపాలని వేడుకొంటున్నా. రైతులు, కూలీలు, దళితుల శ్రేయస్సు కోసం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నా’’ అని సుఖ్‌బీర్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే రైతులు మనల్ని క్షమించరని అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏకాభిప్రాయం అని, అణచివేత కాదు అని పేర్కొన్నారు. 

వ్యవసాయానికి సంబంధించి ‘ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ బిల్లు, ఫార్మర్స్‌ అగ్రిమెంట్‌ ఆన్ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్ ఫార్మర్స్‌ సర్వీసు’ బిల్లులకు ఇవాళ పార్లమెంట్‌ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ ఇప్పటికే అకాలీ నేత హర్‌సిమ్రత్‌ సింగ్‌ బాదల్‌ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఈ బిల్లులను రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన