close

తాజా వార్తలు

Updated : 14/02/2020 15:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిర్భయ కేసు: స్పృహతప్పి పడిపోయిన జడ్జి

దిల్లీ: నిర్భయ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ భానుమతి శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఈ కేసులో దోషులను వేర్వేరుగా ఉరితీయాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌పై తీర్పు వెల్లడిస్తూ ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో కోర్టు సిబ్బంది ఆమెను హుటాహుటిన ఛాంబర్‌కు తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించారు. కొద్ది క్షణాల తర్వాత ఆమె స్పృహలోకి వచ్చారు. 

అంతకు కొద్ది సేపటి క్రితమే నిర్భయ దోషి వినయ్‌ శర్మ పిటిషన్‌పై జస్టిస్‌ భానుమతి ధర్మాసం తీర్పు వెల్లడించింది. తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ వినయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పిటిషన్‌కు ఎలాంటి అర్హత లేదంటూ కొట్టిపారేసింది. ఆ తర్వాత కాసేపటికి కేంద్రం అభ్యర్థనను విచారిస్తుండగా జస్టిస్‌ భానుమతి అస్వస్థతకు గురయ్యారు. 

జస్టిస్‌ భానుమతి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, అయినప్పటికీ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చారని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. ప్రస్తుతం ఛాంబర్‌లోనే ఆమెను వైద్యులు పరీక్షిస్తున్నట్లు చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేసును వచ్చే వారానికి వాయిదా వేశారు. త్వరలోనే తీర్పును వెల్లడిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. 

నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరితీసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే దోషుల కొత్త డెత్‌ వారెంట్లపై ట్రయల్‌ కోర్టులో తీర్పు పెండింగ్‌లో ఉన్నందున తాము వేచి చూస్తామని విచారణ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. డెత్ వారెంట్లపై దిల్లీ ట్రయల్‌ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించనుంది. 

ఇదీ చదవండి..

వినయ్‌ శర్మ పిటిషన్‌ కొట్టివేత



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని