close

తాజా వార్తలు

Updated : 18/12/2020 14:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి ఊరట

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందా? లేదా? అనే అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామని అక్టోబరు 1న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.  విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై యథాతథస్థితి కొనసాగించాలని సూచించింది. తదుపరి విచారణ శీతాకాల సెలవుల తరువాతకు వాయిదా వేసింది.

ఏపీలో పోలీసుల చట్ట ఉల్లంఘనలపై దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు, రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ వేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని