close

తాజా వార్తలు

Published : 19/11/2020 23:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

 ‘జూంద్‌’ విడుదల మరింత ఆలస్యం!

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నటించిన ‘జూంద్‌’ చిత్రం విడుదలపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన ఫిటిషన్‌పై విచారణను అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది.  ఈ చిత్రంపై నెలకొన్న కాపీరైట్స్‌ కేసు తేలేంత వరకు విడుదలను వాయిదా వేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.  ఎన్‌జీవో స్టమ్‌ సాకర్ వ్యవస్థాపకుడు, విజయ్‌ బార్సె జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఈ నెల ఓటీటీలో విడుదకు సిద్ధం చేశారు.  ముందుగా ఈ చిత్రం మే నెలలో థియేటర్లలో విడుదలవ్వాల్సి ఉండగా కొవిడ్‌ కారణంగా ఆగిపోయింది.  గతంలో ట్రయల్‌ కోర్టు ఈ చిత్రం విడుదలను వాయిదా వేయాలని ఆదేశించిన సంగతి విషయం తెలిసిందే.  తీర్పును సవాలు చేస్తూ చిత్ర నిర్మాణ బృందం ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయినా చిత్రం విడుదల వాయిదాను ఎత్తేయాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించింది. 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన