
తాజా వార్తలు
ఎస్పీ బాలు ఆరోగ్యంపై తాజా బులిటెన్
చెన్నై: కరోనాతో పోరాడుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వెల్లడించింది. వెంటిలేటర్, ఎక్మో సాయంతో ఐసీయూలో చికిత్సపొందుతున్నారని తెలిపింది. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ భాస్కరన్ బులిటెన్ విడుదల చేశారు. బాలసుబ్రహ్మణ్యం స్పృహలోకి వచ్చారని, వైద్యానికి స్పందిస్తున్నారని బులిటెన్‌లో పేర్కొన్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిని వైద్యబృందం సునిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు.
ఈ నెల మొదటివారంలో కరోనా బారిన పడటంతో బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు, ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కంగారూను పట్టలేక..
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కన్నీటి పర్యంతమైన మోదీ
- రెరా మధ్యే మార్గం
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
