close

తాజా వార్తలు

Published : 20/08/2020 21:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎక్మో సాయంతో ఎస్పీ బాలుకు చికిత్స!

చెన్నై: కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు ఎంజీఎం ఆస్పత్రి వెల్లడించింది. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్‌ విడుదల చేసింది. వెంటిలేటర్‌పైనే ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నామని తెలిపింది. వెంటిలేటర్‌, ఎక్మో సాయంతోనే ఎస్పీబీకి ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది.

బాలు ఆరోగ్య పరిస్థితిపై ఈ మధ్యాహ్నం ఆయన తనయుడు చరణ్‌ కూడా ఓ వీడియో విడుదల చేశారు. ఎస్పీబీ ఆరోగ్యం ఇంకా ఆందోళనకరంగానే ఉందనీ.. ఎలాంటి పురోగతి లేదన్నారు. అభిమానులు, శ్రేయోభిలాషులు చేస్తున్న ప్రార్థనలు ఆయన త్వరగా కోలుకొనేలా చేస్తాయని విశ్వాసం వ్యక్తంచేస్తూ చరణ్‌ భావోద్వేగానికి గురయ్యారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన