close

తాజా వార్తలు

Published : 21/08/2020 02:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎస్పీబీ ఆరోగ్యం: చరణ్‌ భావోద్వేగ వీడియో

చెన్నై: కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ వివరించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఎస్పీబీ ఆరోగ్యంపై హెల్త్‌ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు.

‘‘అందరికీ నమస్కారం.. నాన్నగారి ఆరోగ్యం ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ఎలాంటి పురోగతి లేదు. అందుకే నేను తరచూ అప్‌డేట్‌ ఇవ్వడం లేదు. అభిమానులు, శ్రేయోభిలాషులు చేస్తున్న ప్రార్థనలు ఆయన త్వరగా కోలుకునేలా చేస్తాయన్న నమ్మకం ఉంది. నాన్న ఆరోగ్యం కుదుటపడాలని సామూహిక ప్రార్థనలు చేస్తున్న చిత్ర పరిశ్రమకు, సంగీత విభాగానికి చెందిన వారికి, దేశ ప్రజలకు ధన్యవాదాలు. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. తమిళంలో మాట్లాడుతూ గద్గద స్వరంతో భావోద్వేగానికి గురయ్యారు.

మరోవైపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని గురువారం సాయంత్రం 6 గంటలకు అటు చిత్ర పరిశ్రమ వర్గాలు, ఇటు ఎస్పీబీ అభిమానులు, శ్రేయోభిలాషులు సామూహిక ప్రార్థనలు చేయనున్నారు.Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన