సన్‌రైజర్స్‌లో హైదరాబాద్‌ యువకుడి పరిచయం
close

తాజా వార్తలు

Published : 30/08/2020 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సన్‌రైజర్స్‌లో హైదరాబాద్‌ యువకుడి పరిచయం

కొత్త ఆటగాళ్లకు స్వాగతం పలికిన వీవీఎస్‌

(ఫొటో: ఎస్‌ఆర్‌హెచ్‌ ట్విటర్‌ వీడియో స్క్రీన్‌షాట్‌)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కోసం గత ఆదివారం దుబాయ్‌కి చేరుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నేటితో క్వారంటైన్‌ గడువును పూర్తి చేసుకోనుంది. దీంతో రేపటి నుంచి ఆటగాళ్లంతా ఔట్‌డోర్‌లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టనున్నారు. అయితే, శుక్రవారం సన్‌రైజర్స్‌ మెంటార్‌, టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ ఏడాది తమ జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాళ్లను పరిచయం చేశాడు. అందులో హైదరాబాద్‌కు చెందిన సందీప్‌ భవనక కూడా ఉన్నాడు. తొలుత లక్ష్మణ్‌ మాట్లాడుతూ ఎస్‌ఆర్‌హెచ్‌ అంటే ఫ్రాంఛైజీ కాదని, ఒక కుటుంబమని చెప్పాడు. అనంతరం ఆటగాళ్లందరికీ స్వాగతం పలికాడు. అలాగే జట్టులోని ప్రతీ ఒక్కరూ ఈ మెగా టోర్నీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. 

రేపటి నుంచే ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెడుతుందని, టోర్నమెంట్‌ ప్రారంభమైందంటే ఇక వరుస మ్యాచ్‌లతో బిజీగా ఉంటామని తెలిపాడు. ఈ సందర్భంగా ఆటగాళ్లంతా ప్రతీ ఒక్కరితో స్నేహంగా ఉండాలని, ఇదివరకు ఎస్‌ఆర్‌హెచ్‌ ఎలా ఉందో అలాగే కొనసాగాలని సూచించాడు. అనంతరం కొత్త ఆటగాళ్లని పరిచయం చేసుకోమని చెప్పాడు. 

కొత్త ఆటగాళ్లు ఎవరు.. ఏమన్నారు?

* అబ్దుల్‌ సమద్‌ జమ్మూ కశ్మీర్‌ నుంచి వచ్చాను. ఇదే నా తొలి ఐపీఎల్‌ టోర్నీ. ఈ సీజన్‌ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఇక్కడి కోచ్‌లతో పాటు చాలా మంది సీనియర్ల నుంచీ ఎన్నో విషయాలు నేర్చుకోగలనని అనుకుంటున్నా.
* భవనక సందీప్‌ హైదరాబాద్‌ నుంచి వచ్చాను. ఈ సీజన్‌ ఆరంభం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. జట్టు నా నుంచి ఏదైతే ఆశిస్తుందో అదే నా తొలి ప్రాధాన్యతగా ఉంటుంది. అందుకోసం కృషిచేస్తా.
* ప్రియమ్‌ గార్గ్‌ ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి. నేనెంతో ఉత్సుకతతో ఉన్నా. ఎందుకంటే ఇదే నా తొలి ఐపీఎల్‌. అవకాశం కోసం వేచి ఉన్నా. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని