close

తాజా వార్తలు

Updated : 15/09/2020 12:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గుండెపగిలింది.. ‘నీట్‌’ను వ్యతిరేకిద్దాం: సూర్య

చెన్నై: వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్‌)కు భయపడి తమిళనాడుకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై కథానాయకుడు సూర్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు తెలిసిన తర్వాత తన గుండె పగిలిందని ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. మరణించిన విద్యార్థుల కుటుంబ సభ్యులు పడుతున్న బాధ ఊహిస్తేనే భయంగా ఉందని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ తీరును విమర్శించారు. ప్రజలు ‘నీట్‌’ను వ్యతిరేకించాలని అన్నారు.

‘‘నీట్‌’ భయంతో ఒకేరోజు ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారనే వార్త నన్ను కలచివేసింది. పరీక్ష రాయడానికి కూర్చున్న విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పడానికి బదులుగా.. ఓదార్పు మాటలు చెప్పాల్సిన పరిస్థితి రావడం కంటే సిగ్గుపడాల్సిన విషయం మరొకటి లేదు. విద్యార్థులు పరీక్షలు రాయాలి, జీవితంలో వారి నైపుణ్యాన్ని నిరూపించుకోవాలి. కానీ, ఈ కరోనా సమయంలోనూ పరీక్షలు రాయాల్సి రావడమే నన్ను బాధిస్తోంది. డాక్టర్‌ కావాలని కలలు కన్న పేద విద్యార్థుల కలల్ని ‘నీట్‌’ చంపేసింది. విద్యార్థుల ఆత్మహత్య విషయంలో మేం మౌనంగా ఉండం..’’ అంటూ సూర్య ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆయనకు మద్దతుగా నెటిజన్లు కామెంట్లు చేశారు. SURIYAagainstNEET అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

అదే విధంగా నటుడు మాధవన్‌ కూడా స్పందిస్తూ.. ‘‘నీట్‌’ పరీక్ష ముందు రోజే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది నిజంగా ఎంతో బాధాకరం.. అది కేవలం ఓ పరీక్ష మాత్రమే, తీర్పు కాదు’ అని పేర్కొన్నారు. ఇదే సంఘటనపై విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ కూడా కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుపట్టారు.

నీట్‌ పై ఆయన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమే..

వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌పై సూర్య చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమేనని మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి తేల్చారు. ఈ మేరకు సూర్య తమిళంలో చేసిన వ్యాఖ్యను మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌.ఎం. బాల సుబ్రహ్మణియన్‌ ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ఈ విషయమై ఆయన మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. నటుడు సూర్య వ్యాఖ్యానం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందంటూ దానిలో ఆయన వివరించారు. తమ ప్రాణాల గురించి భయపడుతున్న న్యాయమూర్తులకు.. విద్యార్థులను నీట్‌ పరీక్షలకు హాజరు కావాల్సిందిగా ఆదేశించే నైతిక హక్కు లేదనే ఉద్దేశాన్ని ఈ ప్రకటన వెల్లడిస్తోందన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని