భార్య ఫొటోలు పెట్టి.. కాల్ ‌గర్ల్‌గా చిత్రీకరించి..
close

తాజా వార్తలు

Updated : 31/12/2020 10:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భార్య ఫొటోలు పెట్టి.. కాల్ ‌గర్ల్‌గా చిత్రీకరించి..

తిరుపతిలో శాడిస్ట్‌ భర్త నిర్వాకం

భర్త ఇంటిముందు ఆందోళనకు దిగిన భార్య

తిరుపతి (నేరవిభాగం): వివాహం జరిగి మూడునెలలు కూడా కాకముందే భార్యను సామాజిక మాధ్యమాల్లో కాల్‌గర్ల్‌గా చిత్రీకరించిన శాడిస్టు భర్త ఉదంతం ఇది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతిలోని తిమ్మినాయుడుపాలేనికి చెందిన రేవంత్‌కుమార్‌ తితిదేలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 13న పలమనేరుకు చెందిన యువతితో ఆయనకు వివాహం జరిగింది. పెళ్లి జరిగిన మూడు రోజుల నుంచే ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. బెల్టుతో కొట్టడం, కాల్చడంతో పాటు అదనపు కట్నం, నగలు తీసుకురావాలని రేవంత్‌ వేధించేవాడు. భార్యను అనుమానిస్తూ తరచూ మరో మహిళతో వివాహేతర సంబంధం నెరిపేవాడు.  

భార్య ఇంట్లోనే ఉన్నప్పటికీ నగదు, నగలతో ఆమె మరొకరితో వెళ్లిపోయినట్లు రెండురోజుల క్రితం పోలీసుస్టేషన్‌లో రేవంత్‌ ఫిర్యాదు చేశాడు. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమెతో పడక గదిలో ఉన్న ఫొటోలను భర్త సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి కాల్‌గర్ల్‌గా చిత్రీకరించాడు. ఈ విషయాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకున్న భార్య.. బుధవారం భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనను అవమానించిన భర్త రేవంత్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తోంది. గతంలో గర్భిణిగా ఉన్నప్పుడు లింగనిర్ధారణ పరీక్షలు చేయించి గర్భాన్ని తీయించాడని ఆమె ఆరోపించింది. భర్తపై తిరుపతిలోని ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

కృష్ణపట్నంలో పారిశ్రామిక కారిడార్‌

రైతులతో కేంద్రం చర్చలు: ప్రతిష్టంభన వీడేనా?Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని