సాయిపల్లవి లక్కీఛాన్స్‌ కొట్టేశారా?
close

తాజా వార్తలు

Updated : 30/10/2020 12:22 IST

సాయిపల్లవి లక్కీఛాన్స్‌ కొట్టేశారా?

హైదరాబాద్‌: నటీనటులు సాయిపల్లవి-నితిన్‌ లక్కీఛాన్స్‌ కొట్టేశారా?అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఓ సినిమాలో వీరిద్దరూ కీలకపాత్రలు పోషించే అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ‘తెలుగు సినిమా అభిమాన పోలీస్‌ ఈజ్‌ బ్యాక్‌ ఇన్‌ ఏ హై ఓల్టేజ్‌ రోల్‌’ అని పేర్కొంటూ పవన్‌కల్యాణ్‌ కొత్త సినిమా గురించి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అభిమానులతో ఓ ప్రత్యేక వీడియోని పంచుకున్న విషయం తెలిసిందే.

మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘అయ్యప్పన్‌ కొషియమ్‌’కు రీమేక్‌గా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకి ‘బిల్లా రంగా’ అనే పేరు కూడా ప్రచారంలో ఉంది. కాగా, మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రను తెలుగులో రానా పోషిస్తాడని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పాత్రలో నితిన్‌ నటించే అవకాశముందని పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఇందులో కథానాయికగా సాయిపల్లవి నటించవచ్చని సమాచారం. ఇప్పటికే చిత్రబృందం ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ వేచి చూడాలి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని