close

తాజా వార్తలు

ఇదే అదృష్టం అంటే..!

సాక్షి చౌదరి


 

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ప్రతిభ ఉన్న నాయికలకు కోలీవుడ్‌ ఎర్ర తివాచి పరచడంలో ఎప్పటికీ ముందుంటుందన్న విషయం తెలిసిందే. ఉత్తరాదికి చెందిన ఎంతో మంది నాయికలు తమిళ తెరపై తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ వరుసలో తనకు కూడా తమిళ ప్రేక్షకులు ఓ స్థానాన్ని కల్పించారని చెబుతోంది నటి సాక్షి చౌదరి. తాజాగా ఆమె నటించిన ‘ఇరుట్టు’ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో సంతోషంలో మునిగిపోయింది. ‘పోటుగాడు’ అనే తెలుగు చిత్రం ద్వారా పరిచయమైన ఈ అమ్మడు 2007లో తమిళంలో ‘ఆయిరత్తిల్‌ ఇరువర్‌’ చిత్రంలో నటించింది. తాజాగా సుందర్‌.సి హీరోగా నటించిన ‘ఇరుట్టు’లో నటించి మెప్పించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమాకు సంబంధించి మంచి రివ్యూలు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఇదే మంచి అదృష్టమంటే. ఈ సినిమా ద్వారా మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పుడు కన్నడలో ‘సువర్ణ సుందరి’, ‘రస్డం’ చిత్రాల్లో నటిస్తున్నానని’ చెప్పింది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.