
తాజా వార్తలు
స్వీయ నిర్బంధంలోకి సల్మాన్
ముంబయి: తన కారు డ్రైవర్‌తోపాటు వ్యక్తిగత సిబ్బందిలోని ఇద్దరు సభ్యులకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ మేరకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి 14 రోజులపాటు హోమ్ క్వారంటైన్లో ఉండనున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సదరు సిబ్బందిని చికిత్స నిమిత్తం ముంబయిలోని ఆస్పత్రికి తరలించారు.
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్స్ ప్రారంభం కావడంతో సల్మాన్ ఇటీవల ‘రాధే’ చిత్రీకరణలో పాల్గొన్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ సరసన దిశా పటానీ సందడి చేయనున్నారు. మరోవైపు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ సల్మాన్ పలు సందర్భాల్లో వీడియోలు షేర్ చేసిన విషయం తెలిసిందే.
Tags :
సినిమా
జిల్లా వార్తలు