close

తాజా వార్తలు

Published : 22/12/2020 11:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కళ్లకు గంతలతో దోశ తిరగేసిన చిరు

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి దోశ ఛాలెంజ్‌ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన దోశ ఛాలెంజ్‌ను చేసి చూపించారు. ఈసారి ఏకంగా కళ్లకు గంతలు కట్టుకుని మరీ దోశ వేసి అభిమానులను అలరించారు. సమంత వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న టాక్‌ షో ‘సామ్‌జామ్‌’. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు. క్రిస్మస్‌ కానుకగా చిరంజీవి తనదైన స్టైల్‌లో అలరించేందుకు సిద్ధమయ్యారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సమంత అడిగిన పలు ప్రశ్నలకు చిరు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు.‘మీరు ఎప్పుడైనా సినిమా చూస్తూ ఏడ్చేశారా’ అంటూ సమంత ప్రశ్నించగా, ఓ సినిమాకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపారు. తర్వాత కిందకు వంగి కళ్లు తుడుచుకుంటుండగా లైట్స్‌ వేశారని, తాను పైకి లేచేసరికి పైట తన చేతిలో ఉందని నవ్వుతూ చెప్పారు. చేతులు లేని ఓ బాలుడు వేదికపైనే నోటితో చిరు పెయింట్‌ వేయడంతో ఆనందపడిపోయిన ఆయన ఆ బాలుడిని మెచ్చుకున్నారు. అనంతరం కళ్లకు గంతలు కట్టుకుని దోశను తిరగేశారు. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులు ఆకట్టుకుంటోంది.




Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని