సమంత కొత్త ఛాలెంజ్‌.. ఆలస్యమైందన్న రానా
close

తాజా వార్తలు

Published : 21/08/2020 02:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమంత కొత్త ఛాలెంజ్‌.. ఆలస్యమైందన్న రానా

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో టాలీవుడ్‌ కథానాయిక సమంత మిద్దెపై వ్యవసాయం చేస్తున్న సంగతి తెలిసిందే. పోషక విలువలు కలిగిన మొక్కలను పెంచుతూ అందుకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సమంత ‘గ్రో విత్‌ మి’ అనే ఛాలెంజ్‌ను రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మంచు లక్ష్మి విసిరారు. ఎవరికి వారే తమ ఆహారాన్ని పండించుకోవాలన్నారు.

‘‘మరికొన్ని వారాల పాటు కలిసి పండించుకుందాం. చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుందాం. ఒక కుండీ, కొద్దిగా మట్టి, విత్తనాలు, ఖాళీ పాల ప్యాకెట్ ఉన్నా సరే. ఇప్పుడు పని మొదలు పెట్టండి. లక్ష్మి మంచు, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను నామినేట్‌ చేస్తున్నా’’ అని పేర్కొన్నారు.

ఇక భళ్లాలదేవుడు రానా ఎట్టకేలకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. ప్రభాస్‌, శ్రుతిహాసన్ విసిరిన ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేయడం కాస్త ఆలస్యమైందన్నారు. తన అభిమానులందరికీ ఈ ఛాలెంజ్‌ విసురుతున్నట్లు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని