close

తాజా వార్తలు

Published : 07/11/2020 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ షో కోసం సమంత ప్రత్యేక డ్రెస్‌: ధర ఎంతంటే?

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయిక సమంత నటిగా తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నారు. తాజాగా మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘‘నటిగా నా పదేళ్ల ప్రయాణం ఒకెత్తు.. ఇప్పుడు చేయబోతున్న ఈ కొత్త ప్రయాణం మరొకెత్తు’’ అంటూ చెప్పిన ఆమె,  ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ‘సామ్‌ జామ్‌’ పేరుతో టాక్‌ షో చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక దుస్తుల్లో సమంత తళుక్కున మెరిశారు.

మ్యాక్సీ డ్రెస్‌ ధరించిన ఫొటోలను సైతం ఆమె అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ డ్రెస్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అయ్యింది. ఈ డ్రెస్‌ గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజన్లు. పంకజ్‌ అండ్ నిధి లేబుల్‌పై తయారు చేసిన కాన్వా ఫ్లూయిడ్‌ మాక్సీ డ్రెస్‌ ధర ఆన్‌లైన్‌లో రూ.27,000గా ఉంది. అంతేకాదు, దీనికొక ప్రత్యేకత కూడా ఉంది. ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేయడం ద్వారా రూపొందించిన ప్రత్యేక వస్త్రంతో దీన్ని తీర్చిదిద్దారట. ఈ డ్రెస్‌పై సమంత శంఖు ఆకారంలో ఉన్న చెవిపోగులతో పాటు, నక్షత్రాకారంలో ఇయర్‌ టడ్స్‌ను ధరించి కనువిందు చేశారు.

ఈ కార్యక్రమ ఆవిష్కరణ వేడుకలో సమంత మాట్లాడుతూ.. ‘‘నాకెంతో ప్రత్యేకమైన ప్రయాణమిది. ఈ టాక్‌ షో చేశాక.. దీనితో పోల్చితే నటన చాలా సులువనిపించింది. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నా. దీని ద్వారా కొత్త ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, సామాజిక సమస్యల్ని ఎత్తి చూపించబోతున్నా’’ అంది.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని