
తాజా వార్తలు
‘సర్కారు వారి పాట’ షురూ!
సితార క్లాప్.. నమ్రత స్విచ్చాన్..!
హైదరాబాద్: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షురూ అయ్యింది. ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. చిత్ర బృందంతోపాటు మహేశ్ సతీమణి నమ్రత, కుమార్తె సితార తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సితార ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టింది. నమ్రత కెమెరా స్విచ్చాన్ చేశారు. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో చిత్రీకరణ ప్రారంభం కాబోతోందని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సంస్థ ట్వీట్ చేసింది. ప్రారంభోత్సవంలో తీసిన ఫొటోలను పంచుకుంది.
‘సరిలేరు నీకెవ్వరు’ హిట్ తర్వాత మహేశ్ ‘సర్కారు వారి పాట’కు సంతకం చేశారు. ‘గీత గోవిందం’ ఫేం పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. ఎస్. తమన్ బాణీలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా తమిళ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడు పోయినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర బృందం స్పందించలేదు. మరోపక్క మహేశ్ నిర్మాతగా అడివిశేష్ కథానాయకుడిగా ‘మేజర్’ సినిమా రూపుదిద్దుకుంటోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కంగారూను పట్టలేక..
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కన్నీటి పర్యంతమైన మోదీ
- రెరా మధ్యే మార్గం
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
