close

తాజా వార్తలు

Updated : 05/07/2020 10:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సరోజ్‌ఖాన్‌ మృతి: విచారంలో బాలీవుడ్‌

ముంబయి: ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్‌ఖాన్‌(71) మృతి చెందారన్న వార్త  బాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది. శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం వేకువజామున గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో యావత్‌ చిత్ర పరిశ్రమ విచారంలో మునిగిపోయింది. ఆమెతో ఉన్న అనుబంధాన్ని బాలీవుడ్‌ నటులు గుర్తు చేసుకున్నారు. అజయ్‌దేవగణ్‌, అనుష్కశర్మ, వరుణ్‌ధావన్‌, టైగర్‌ష్రాఫ్‌ తదితరులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆమెకు నివాళులర్పించారు. ఆమెతో పనిచేయడం గొప్ప అనుభూతిగా పేర్కొన్నారు.

‘‘ఒక టెక్నీషియన్‌ కుమారుడిగా తెర వెనుక ఎంతమంది కష్టం ఉంటుందో నాకు తెలుసు. సరోజ్‌ జీ ఆత్మకు శాంతి చేకూరాలి. మీరొక గొప్ప కళా సంస్థలాంటివారు. నృత్య కళా విభాగంలో మీరొక అసమాన ప్రతిభావంతులు. మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ -అజయ్‌ దేవగణ్‌

‘‘సరోజ్‌ జీ నడిచే కళా సంస్థలాంటి వారు. ఆమె ఎంతోమంది నృత్య దర్శకులు, డ్యాన్సర్లు, నటులు, దర్శకులకు స్ఫూర్తి. డ్యాన్స్‌ రూపంలో ఆమె ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆమె కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ -అనుష్కశర్మ

‘‘లెజెండరీ సరోజ్‌ఖాన్‌ ఇకలేరన్న ఒక విషాద వార్తతో నిద్రలేచా. ఎవరైనా చేయగలిగేలా డ్యాన్స్‌ను మరింత సులభం చేశారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’’-అక్షయ్‌కుమార్‌

ఇక వరుణ్‌ధావన్‌, ట్రైగర్‌ ష్రాఫ్‌లు సరోజాఖాన్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తెలుగులో చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘చూడాలని ఉంది’ చిత్రంలో ‘ఓ మారియా.. ఓ మారియా’ పాటకు ఆమె నృత్యాలు సమకూర్చిన వీడియోను గుణశేఖర్‌ పంచుకున్నారు.

మలద్‌లో అంత్యక్రియలు

సరోజ్‌ఖాన్‌ అంత్యక్రియలు ముంబయిలోని మలద్‌లో ముగిశాయి. వచ్చేవారం ప్రార్థానా సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆమె కుమార్తె వెల్లడించారు.

 



 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని