close

తాజా వార్తలు

Published : 26/06/2020 21:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జులై 31వరకు దిల్లీలో స్కూళ్లు మూత

సిలబస్‌ను 50% తగ్గించడంపైనా చర్చ

దిల్లీ: దేశ రాజధాని నగరాన్ని కరోనా వైరస్‌ వణికిస్తోంది. రోజురోజుకీ ఈ మహమ్మారి ఉద్ధృతమవుతున్న వేళ దిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జులై 31 వరకు దిల్లీలోని పాఠశాలలన్నీ మూసే ఉంటాయని డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ప్రకటించారు. విద్యాశాఖ అధికారులతో సమావేశం అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సిలబస్‌ను 50శాతం తగ్గించాలనే ప్రతిపాదనపైనా ఈ సమావేశంలో చర్చించినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ఆన్‌లైన్‌ తరగతులు, కార్యకలాపాలు నిర్వహించేందుకు అధికారులు అంగీకరించినట్టు తెలుస్తోంది. అలాగే, సాధ్యమైన ప్రాంతాల్లో పాఠశాలలు ఆన్‌లైన్‌ లైబ్రరీలు ప్రారంభించాలని నిర్ణయించారు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు 9, 10 తరగతి విద్యార్థులను చిన్న చిన్న గ్రూపులుగా విభజించి తరగతులు నిర్వహిస్తే బాగుంటుందని కొందరు అధికారులు సిసోడియాకు సూచించగా.. పదో తరగతి విద్యార్థుల వరకైనా తరగతులు నిర్వహించడం మంచిదని మరికొందరు సూచించినట్టు సమాచారం.

ఇదీ చదవండి

కొవిడ్‌ రేసులో.. ముంబయిని దాటేసిన దిల్లీ

ఏడాదిలోపు కరోనా వ్యాక్సిన్‌: WHO


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని