అన్నింటా ఆధారం.. ‘సీడ్స్‌’సహకారం..
close

తాజా వార్తలు

Updated : 23/11/2020 05:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నింటా ఆధారం.. ‘సీడ్స్‌’సహకారం..


 

ఇంటర్నెట్‌ డెస్క్ : ఊరు మనకేమిచ్చిందన్నది కాదు... మనం ఊరికి ఏం ఇచ్చాం? ఊరు అభివృద్ధిలో మన సహకారం ఏమిటి? అని ఆలోచించిన ఆ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. పుట్టిన ప్రాంతం అభివృద్ధి కోసం అన్ని విధాల కృషి చేస్తోంది. బాలబాలికల చదువుల నుంచి మహిళల ఉపాధి వరకు.. అన్నింటా తోడుగా నిలుస్తోంది. పట్నం వలసలు ఆపి.. గ్రామాల్లోనే సంపద సృష్టించేలా కచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఆ సంస్థే సీడ్స్‌. తమ ప్రాంతంలోని ప్రజలకు అండగా నిలిచి, వారి స్థితిగతులు మెరుగు పడేలా చేయలన్న లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. 

నెల్లూరు జిల్లాలో అంత్యంత వెనుకబడిన ప్రాంతం దుత్తలూరు. ఇక్కడి ప్రజల అభివృద్థి కోసం ఏమైనా చేయాలని మాజీ ఐఏఎస్‌ ఆర్‌సీఎమ్ రెడ్డి ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించాలనుకున్నారు. అందులో భాగంగా కొందరు యువకులను ఎంపిక చేసుకుని 2008లో సీడ్స్‌ సంస్థకు పునాది వేశారు.

మిశ్రమ సేద్యం చేయించాలని....
ఈ ప్రాంతంలోని రైతులు ఆర్థికంగా మెరుగుపడాలంటే మిశ్రమ సేద్యం చేయాలని సీడ్స్‌ భావించింది. అందులో భాగంగానే మెట్ట ప్రాంతాల రైతులు కొద్ది భూమిలోనే అధిక దిగుబడి ఎలా సాధించవచ్చో చూపించింది. అనుబంధ పంటలు, నిమ్మ, బత్తాయి, ఆకుకూరలు, కూరగాయల సాగుకు ప్రోత్సాహం అందిస్తోంది. నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో బిందు సేద్యం, వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవటం, భూగర్భ జలాలను పెంచుకోవటం వంటి అనేక అంశాలపై ఇక్కడి వారికి ప్రత్యేక అవగాహన కల్పిస్తోంది‌. రైతులు సౌరవిద్యుత్తును వినియోగించేలా ప్రోత్సహిస్తోంది. అందుకోసం ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.

కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారికి....
సీడ్స్‌ సంస్థ కరోనా కారణంగా కష్టాల్లో కూరుకుపోయిన కుటుంబాలకు కూడా అండగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. వారికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తోంది. మహిళలకు మాస్కుల తయారీ వంటి వాటిలో శిక్షణ ఇస్తోంది. తద్వారా చాలా మందికి ఆర్థిక భరోసా లభిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించటం కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా అందిస్తున్నారిక్కడ. ఇవే కాకుండా విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌ షిప్‌లు ఇవ్వటంతో పాటు, జిల్లాలోని తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలను కూడా దత్తత తీసుకుంది ఈ సంస్థ. దుత్తలూరు ప్రాంత వాసులకు ఉచితంగా కంటి పరీక్షలు చేయిస్తూ, ఎల్వీ ప్రసాద్‌ సంస్థ సహకారంతో తక్కువ ధరకే కళ్లద్దాలు అందించేందుకూ కృషిచేస్తోంది సీడ్స్‌. ఏసీ గదుల్లో పనిచేస్తూ రూ.లక్షల్లో వేతనం తీసుకోవటం కంటే సేవా కార్యక్రమాలు చేయటమే సంతృప్తిని ఇస్తుందంటున్నారు సీడ్స్‌ సభ్యులు. నిస్వార్థంగా పనిచేస్తున్న తమ సంస్థ ప్రయాణంలో నిరంతరం తోడుగా ఉంటామని పేర్కొంటున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని