close

తాజా వార్తలు

పఠాన్‌ నిస్వార్థ ఆటగాడు: ఛాపెల్‌

దిల్లీ: భారత మాజీ పేసర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ను టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. పఠాన్‌ ఎంతో ధైర్యశాలి, నిస్వార్థ ఆటగాడని కొనియాడాడు. ఇటీవల ఇర్ఫాన్‌ పఠాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ‘‘జట్టు కోసం ఎలాంటి బాధ్యతలు అయినా ఇర్ఫాన్ సంతోషంగా అందుకునేవాడు. అతడు ఎంతో ధైర్యశాలి, నిస్వార్థ ఆటగాడు. అతడు సత్తా ఉన్న ఆల్‌రౌండర్‌ అని నిరూపించుకున్నాడు. వన్డేల్లో రాణించాడు. టెస్టుల్లో కూడా ఫర్వాలేదనిపించాడు. బంతిని స్వింగ్స్‌ చేస్తూ అతడు అదరగొట్టాడు. కరాచిలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ సాధించడం పఠాన్‌ ప్రదర్శనల్లో అత్యుత్తమం’’ అని ఛాపెల్‌ తెలిపాడు.

అయితే పఠాన్‌ తన లయను కోల్పోవడానికి ఛాపెల్‌ ప్రయోగాలే కారణమని గతంలో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన పఠాన్‌.. ఛాపెల్‌ను నిందించడం సరికాదని పేర్కొన్నాడు. ‘‘నా పతనానికి ఛాపెల్‌ కారణమని చెప్పడమంటే సాకులు వెతుక్కోవడమే. నేను ఆసక్తి కోల్పోయానన్న చర్చ ఎక్కడ మొదలైందో తెలియదు. నేను స్వింగ్‌ కోల్పోయానని చాలామంది అన్నారు. కొత్త బంతితో మాదిరి స్వింగ్‌ను ఎప్పుడూ రాబట్టడం సాధ్యం కాదని గ్రహించాలి. నా చివరి మ్యాచ్‌ ఆడేటప్పటికీ నేను స్వింగ్‌ చేస్తూనే ఉన్నా’’ అని పఠాన్‌ పేర్కొన్నాడు. భారత్‌ తరఫున అతడు 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన భారత జట్లలో ఇర్ఫాన్ సభ్యుడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.