టిక్‌టాక్‌కు ట్రంప్‌ డెడ్‌లైన్‌
close

తాజా వార్తలు

Updated : 04/08/2020 12:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టిక్‌టాక్‌కు ట్రంప్‌ డెడ్‌లైన్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌కు డెడ్‌లైన్‌ విధించారు. తమ దేశంలో టిక్‌టాక్‌  కార్యకలాపాలను సెప్టెంబరు 15లోగా విక్రయించాలని.. అలా జరగకపోతే మూసివేయాలని హెచ్చరించారు. అమెరికాలో టిక్‌టాక్‌ యాప్‌ కార్యకలాపాలను, సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి ఏమీ అభ్యంతరం లేదన్నారు. మైక్రోసాఫ్ట్‌ లేదా ఏ ఇతర అమెరికన్‌ కంపెనీ కొనుగోలు జరిపినా.. చేతులు మారిన మొత్తంలో కొంత భాగాన్ని అమెరికా ప్రభుత్వానికి చెల్లించాలని ఆయన నిబంధన విధించారు.
అమెరికాలో టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధిస్తామని ట్రంప్‌ శుక్రవారం చేసిన ప్రకటనతో.. ఈ చైనా సంస్థ భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. కాగా, టిక్‌టాక్‌ కొనుగోలు విషయమై మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల అమెరికా అధ్యక్షుడితో ఆదివారం చర్చలు జరిపారు. యాప్‌ భద్రత, పనితీరు, కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన అంశాలను ఆయన అధ్యక్షుడికి వివరించారు. టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డాన్స్‌తో కొనుగోలు విషయమై జరుపుతున్న చర్చలు సెప్టెంబరు 15 నాటికి పూర్తవుతాయని ఆశిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని