శివసేన ఎప్పటికీ మహిళల్ని అవమానించదు..
close

తాజా వార్తలు

Published : 07/09/2020 17:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శివసేన ఎప్పటికీ మహిళల్ని అవమానించదు..

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. సంజయ్‌ మనస్తత్వం మహిళలకు వ్యతిరేకంగా ఉందని తాజాగా కంగన చేసిన వ్యాఖ్యలపై ఆయన దీటుగా స్పందించారు. శివసేన పార్టీ ఎప్పటికీ మహిళల్ని అవమానించదంటూ ఆమె వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా ఓ ఫొటో పోస్ట్‌ చేశారు. ‘ఛత్రపతి శివాజీ మహరాజ్‌, రాణాప్రతాప్‌ వంటి గొప్ప హిందూ వీరుల సిద్ధాంతాల్ని శివసేన పార్టీ అవలంభిస్తోంది. మహిళల్ని గౌరవించడంలో వారే మాకు స్ఫూర్తి. కానీ కొందరు మేం స్త్రీలను అవమానించామంటూ తప్పుడు వార్తల్ని సృష్టిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్నవారు ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు. మీరే ముంబయిలోని ముంబాదేవీని అవమానిస్తున్నారు. మహిళల కోసం పోరాటం చేయడంలో శివసేన ఎప్పటికీ ముందు వరుసలో ఉంటుంది’ అని పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో ఉన్న కంగనా రనౌత్‌ భద్రతపై ఆ రాష్ట్ర సీఎం జేఆర్‌ ఠాకూర్‌ స్పందించారు. కంగన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి తనకు లేఖ రాశారని అన్నారు. ఇప్పటికే ఆమె ఇంటి వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా కంగనకు వై ప్లస్ కేటగిరి భద్రతను కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని