
తాజా వార్తలు
భారీ నష్టాల్లోకి జారిపోయిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల దిశగా కొనసాగుతున్నాయి. ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో ఊగిసలాట ధోరణిలో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి దిగజారిపోయాయి. ఉదయం 11.46 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 789 పాయింట్లు నష్టపోయి.. 29,776 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 234 పాయింట్లు నష్టపోయి 8,732 వద్ద ట్రేడవుతోంది. యూఎస్ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 74.12 వద్ద కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా వైరస్ ప్రభావంతో మదుపరులు భయాలకు లోనవుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జీ ఎంటర్టైన్మెంట్స్, యెస్ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్, వేదాంత షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. భారతీ ఇన్ఫ్రాటెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Tags :
జిల్లా వార్తలు