
తాజా వార్తలు
మార్కెట్లకు ఆర్బీఐ బూస్ట్
ముంబయి: దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మ్యూచుఫల్ ఫండ్స్ పరిశ్రమకు ఆర్బీఐ ప్యాకేజీ ప్రకటించడంతో బ్యాంకింగ్ సహా అసెట్ మేనేజ్మెంట్ షేర్లు దూసుకెళ్లాయి. దీనికి తోడు ఇతర ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో పయనించడంతో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభంతో ముగిసింది. ఒకానొక దశలో 32 వేల మార్కును దాటినప్పటికీ చివర్లో అమ్మకాల ఒత్తిడితో 31,743.08 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 127.90 పాయింట్లు లాభపడి 9,282.30 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.24గా ఉంది.
నిఫ్టీలో ఇండస్ ఇండ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిం షేర్లు నష్టాలు చవిచూశాయి. రంగాలవారీగా చూస్తే బ్యాంక్, ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాల్లో ముగిశాయి.
ఇదీ చదవండి..
ఫండ్ పరిశ్రమకు ఆర్బీఐ అండ