close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 19/05/2020 09:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పుంజుకున్న మార్కెట్లు

ముంబయి: చివరి మూడు సెషన్లలో భారీ నష్టాల్ని మూటగట్టుకున్న మార్కెట్లు మంగళవారం పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలందడం సూచీలకు దన్నుగా నిలిచింది. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 227 పాయింట్లు లాభపడి 30,256 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 66 పాయింట్లు ఎగబాకి 8,889 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.02 వద్ద కొనసాగుతోంది.

కరోనాకు వ్యాక్సిన్‌పై జరుగుతున్న ప్రయోగాల్లో ఉత్సాహకర ఫలితాలు లభించాయన్న ఔషధ తయారీ సంస్థ మోడర్న ప్రకటన మదుపర్ల సెంటిమెంటును సానుకూలపరిచింది. దీంతో అటు అమెరికా మార్కెట్లు లాభపడగా.. దాన్నుంచి ఫలితాలందుకున్న ఆసియా మార్కెట్లు సైతం సానుకూలంగా సాగుతున్నాయి. మరోవైపు లాక్‌డౌన్‌ ఎత్తివేత.. క్రమంగా ప్రయాణాలు పునరుద్ధరిస్తుండడంతో చమురు ధరలు సైతం పుంజుకున్నాయి. అలాగే గత నెల కుదిరిన ఒప్పందం ప్రకారం ఒపెక్‌ ప్లస్‌ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించే దిశగా సాగుతుండడంతో చమురు ధరలకు దన్ను లభించింది. మరోవైపు గత మూడు సెషన్ల భారీ నష్టాల నుంచి పుంజుకోవడంలో భాగంగా సూచీలు స్థిరీకరణ దిశగా సాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి.

ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. యూపీఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, వేదాంత, విప్రో లిమిటెడ్‌ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.