close

తాజా వార్తలు

Published : 14/02/2020 16:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బ్యాంకింగ్‌ షేర్లు పడేశాయ్‌..

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల విషయంలో సుప్రీం కోర్టు టెలికాం సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడింది. దీనివల్ల టెలికాం కంపెనీల నిరర్ధక ఆస్తులు పెరిగే సూచనలు ఉన్నాయన్న భయాలతో బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోయాయని విశ్లేషకులు అంటున్నారు. దీంతో సెన్సెక్స్‌ 202.05 పాయింట్లు నష్టపోయి 41,257.74 వద్ద ముగిసింది. నిఫ్టీ 61.20 పాయింట్లు నష్టపోయి 12,113.50 వద్ద స్థిరపడింది.

నిఫ్టీలో భారతీ ఎయిర్‌టెల్‌, యస్‌బ్యాంక్‌, యూపీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ షేర్లు లాభపడగా.. గెయిల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 71.36గా ఉంది. బ్యాంకింగ్‌, ఆటో, ఎఫ్‌ఎంసీసీ, ఇంధన షేర్లు నష్టాలు చవిచూశాయి.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని