close

తాజా వార్తలు

Published : 29/04/2020 09:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్‌ 252 పాయింట్లు లాభపడి 32,366 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 72 పాయింట్లు ఎగబాకి 9,453 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.34 వద్ద కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడి విషయంలో కొన్ని దేశాల్లో ఆంక్షలు ఇంకా కొనసాగుతుండడం, మరికొన్నింటిలో క్రమంగా నిబంధనల్ని సడలిస్తుండడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు తెలిపారు. మరోవైపు ఐటీ, ఫార్మా, ఆర్థిక రంగాల షేర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. 

హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫినాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, గెయిల్‌, టాటా స్టీల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌ కంపెనీ, హెచ్‌యూఎల్‌, హిందూస్థాన్‌ పెట్రోలియం షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని