
తాజా వార్తలు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఆరంభంలో ఊగిసలాటలో మొదలైన మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 202 పాయింట్లు నష్టపోయి.. 41,055 వద్ద ముగిసింది. నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 12,045వద్ద ముగిసింది. యూఎస్ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.39 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న కరోనా భయాలతో పాటు, మెటల్, ఇంధన షేర్లు నష్టాల్లోకి పోవడం మార్కెట్లపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీలో టైటాన్ కంపెనీ, నెస్లే, టీసీఎస్, వేదాంత, కొటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో పయనించగా.. యస్ బ్యాంకు, కోల్ ఇండియా, గెయిల్, సిప్లా, ఓఎన్జీసీ షేర్లు నష్టాలతో ముగిశాయి.
Tags :
జిల్లా వార్తలు