close
Array ( ) 1

తాజా వార్తలు

భారీగా పుంజుకున్న సూచీలు

ముంబయి: కరోనా వైరస్‌ కష్టాలతో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుతం భారీగా పుంజుకున్నాయి. సెన్సెక్స్‌ దాదాపు 2000 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ సైతం 550 పాయింట్లకు పైగా ఎగబాకింది. ఉదయపు నష్టాల నుంచి రికవరీలో భాగంగా కీలక రంగాలు, ప్రముఖ కంపెనీల షేర్లు బలపడడమే సూచీల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. మధ్యాహ్నం 1.45 గంటలకు సెన్సెక్స్‌ 1976 పాయింట్ల లాభంతో 30,264 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 575 పాయింట్లు ఎగబాకి 8,838 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.35 వద్ద కొనసాగుతోంది. కార్పొరేషన్‌ కంటైనర్‌ షేర్లు 22.39శాతం, ఐటీఐ 18.26శాతం, సెరా శానిటరీవేర్ లిమిటెడ్‌ 17.69శాతం, ఓఎన్‌జీసీ 15.14శాతం, గెయిల్‌ 14.41శాతం, విప్రో 13.65శాతం, హిందూస్థాన్‌ యూనిలివర్‌ 8శాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 561 పాయింట్లు, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ 450 పాయింట్లు లాభపడడం గమనార్హం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.