close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120028391 [video_srlno] => 1 [video_type] => 2 [video_link] => https://www.facebook.com/ETVTelangana/videos/526526134655958 [video_short_link] => https://www.facebook.com/ETVTelangana/videos/526526134655958 [created_by] => [created_date] => [modified_by] => 9823211 [modified_date] => 2020-02-28 18:44:03.616276 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

‘కరోనా’ దెబ్బకు కుదేలైన మార్కెట్లు

ముంబయి: ‘కరోనా’ దెబ్బకు దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ అత్యంత భారీ నష్టాలను చవిచూశాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మన మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. వరుసగా నష్టాల బాటలో పయనిస్తున్న సూచీలకు బ్లాక్‌ ఫ్రైడే మిగిలింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 1,448 పాయింట్లు నష్టపోయి 38,297 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 431.55 పాయింట్ల నష్టంతో 11,201.75 వద్ద స్థిరపడింది. లోహ, టెక్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి. 

చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుండటంతో విదేశీ మదుపరులు భయాందోళనకు గురయ్యారు. దీంతో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో ఒక్కసారి దేశీయ సూచీలు కుదేలయ్యాయి. ఈ రోజు ఉదయం మార్కెట్లు నష్టాలతోనే ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆరంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 1,100 పాయింట్లకు పైగా నష్టపోయింది. తొలి గంటలోనే సుమారు 5లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. ఒకానొక దశలో 1,525 పాయింట్లు పతనమైన సూచీలు చివరకు 1,448 పాయింట్ల నష్టంతో ముగిశాయి. నిఫ్టీలో ఐవోసీ ఒక్కటే లాభపడగా, వేదంతా, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, హిందాల్కో షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

 మార్కెట్ల పతనానికి కారణాలివే..!

> భారత్‌ వీఐఎక్స్‌ ఇండెక్స్‌లో భారత్‌ 15 శాతం వృద్ధి సాధించడం కూడా  భయపెట్టింది. ఇది మదుపరుల్లో ఆందోళనను రెట్టింపు చేసింది. 

> ఈ రోజు ప్రభుత్వం అభివృద్ధి అంకెలను ప్రకటించనుండటం కూడా మార్కెట్లలో భయాలను నింపింది. జీడీపీ 4.7శాతం  వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది ఎక్కువ. ఒక వేళ గతం కంటే తగ్గితే కనుక నష్టాలు కొనసాగే అవకాశం ఉంది.  దేశీయ మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్లపై కరోనా ప్రభావాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. 

> మార్కెట్లలోని మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీల్లో అమ్మకాల ఒత్తిడి బాగా కనబడుతోంది. ఈ సూచీలు దాదాపు 2.5శాతం కుంగాయి. 

 రాత్రి వాల్‌స్ట్రీట్‌ భారీగా పతనం కావడం ఆసియా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. జపాన్‌ సూచీలు 3.5శాతం, చైనా మార్కెట్లు 2.5శాతం విలువ కోల్పోయాయి. 

> నిన్న రాత్రి అమెరికాలోని డొజోన్స్‌ సూచీ చరిత్రలోనే అతిపెద్ద ఒక్కరోజు పతనాన్ని చవిచూసింది. దాదాపు 1200 పాయింట్లను కోల్పోయింది. ఫిబ్రవరి 19 తర్వాత ఎస్‌అండ్‌పీ 500 కూడా 10శాతం విలువ కోల్పోయింది.

> అమెరికాలో కరోనా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లని ఒక మహిళకు కూడా ఈ వైరస్‌ సోకడంతో కాలిఫోర్నియా రాష్ట్రంలో దాదాపు 8400 మందిని పర్యవేక్షణలో ఉంచారు. ఇలాంటి అంశాలు ప్రపంచ మార్కెట్ల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నాయి. 

> మరోపక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ ఇటీవల స్పందిస్తూ ‘మేము కీలక  నిర్ణయం తీసుకొనే సమయం ఆసన్నమైంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు స్పందిస్తేనే త్వరగా వైరస్‌ను అరికట్ట వచ్చు. ప్రజలు అనారోగ్యం పాలుకాకుండా కాపడవచ్చు’ అని పేర్కొన్నారు. 

> అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ బీవోఎఫ్‌ఏ కూడా ప్రపంచ వృద్ధిరేటును ఇటీవల తగ్గించింది. అది కూడా ఆర్థిక సంక్షోభం నాటి స్థాయికి కోత విధించడం గమనార్హం. 
> కరోనా వైరస్‌ ప్రపంచ, అమెరికా ఆర్థిక మాంద్యానికి బీజంగా మారుతుందని మూడీస్‌ హెచ్చరించింది. 

> ఒక పక్క చైనాలో కొత్తగా కరోనా కేసులు నమోదు తగ్గుముఖం పడితే.. ప్రపంచ వ్యాప్తంగా పెరగడం ఆందోళనకరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులు చైనాను దాటేశాయి. ఈ విపత్తు ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం ఆందోళనకరంగా మారింది. వ్యాధిగ్రస్థుల సంఖ్య లక్షకు చేరువ కావడం మార్కెట్లలో భయాలను పెంచేసింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్ చరిత్రలో భారీ పతనాల వరుస వివరాలు ఇలా..

* ఆగస్టు 24, 2015, బీఎస్‌ఈ సెన్సెక్స్‌  1,624.51 పాయింట్లు నష్టపోయింది.

కారణం: ప్రపంచ మార్కెట్ల పతనం.. రూపాయి బలహీనత.

* ఫిబ్రవరి 28, 2020 బీఎస్‌ఈ సెన్స్‌క్స్‌ 1,400 పాయింట్లు నష్టపోయింది.  

కారణం:  కరోనా వైరస్‌ వ్యాప్తి భయాల కారణంగా ప్రపంచ మార్కెట్ల పతనం.

* జనవరి 21, 2008  బీఎస్‌ఈ సెన్స్‌క్స్‌ 1,408 35 పాయింట్లు నష్టపోయింది. 

జనవరి 22, 2008 - 875 41 పాయింట్లు

మార్చి 03, 2008 -  900 84 పాయింట్లు

మార్చి 17, 2008 - 951.03 పాయింట్లు

అక్టోబర్‌ 24, 2008 -  1070.63 పాయింట్లు

కారణం: అంతర్జాతీయంగా  భయాందోళనలు. ఆర్థిక మందగమనం. 

* ఫిబ్రవరి 01, 2020 బీఎస్‌ఈ సెన్స్‌క్స్‌ 987.96 పాయింట్లు నష్టపోయింది.  

కారణం:  మార్కెట్‌ వర్గాలు ఆశించినంతస్థాయిలో 2020-21 బడ్జెట్‌ లేకపోవడం.

*  ఫిబ్రవరి 02, 2018  బీఎస్‌ఈ సెన్స్‌క్స్‌ 839.91 పాయింట్లు నష్టపోయింది.

కారణం:  స్టాక్ పెట్టుబడులకు కఠినమైన పన్ను నియమాలు విధించడం,  కేంద్ర బడ్జెట్‌లో ద్రవ్య లోటు తగ్గుదల 

*  ఫిబ్రవరి 11, 2016 బీఎస్‌ఈ సెన్స్‌క్స్‌  807.07 పాయింట్లు నష్టపోయింది.

కారణం: ఆర్థిక మందగమనం.

* జులై 08, 2019  బీఎస్‌ఈ సెన్స్‌క్స్‌   792.82 పాయింట్లు నష్టపోయింది.

కారణం: అస్థిరత,  వడ్డీ రేట్ల పెరుగుదల 

* ఆగస్టు  16, 2013  బీఎస్‌ఈ సెన్స్‌క్స్‌  769.41 పాయింట్లు నష్టపోయింది.

కారణం: అమెరికా ఉద్దీపన ఉపసంహరణ,  యూఎస్‌డీకి వ్యతిరేకంగా రూపాయి 62 కనిష్ఠ స్థాయికి పడిపోవడం, తదితర ఆందోళనలు 

* సెప్టెంబరు 22, 2011  బీఎస్‌ఈ సెన్స్‌క్స్‌ 704.00 పాయింట్లు నష్టపోయింది.

కారణం: అమెరికాలో స్టాక్‌ మార్కెట్‌ మందగమనం  

* ఆగస్టు 13, 2019 బీఎస్‌ఈ సెన్స్‌క్స్‌ 623.75 పాయింట్లు నష్టపోయింది

కారణం:  ప్రపంచ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.