close

తాజా వార్తలు

Published : 15/06/2020 12:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కమ్మేసిన కరోనా భయం..

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మధ్యాహ్నం సమయానికి భారీ నష్టాల్లోకి జారుకొన్నాయి.  సుమారు 12.00 గంటల సమయంలో నిఫ్టీ 219 పాయింట్లు నష్టపోయి 9,753 వద్ద, సెన్సెక్స్‌ 767 పాయింట్లు  నష్టపోయి 33,001 వద్ద ట్రేడవుతున్నాయి. టీవీ 18 బ్రాడ్‌కాస్ట్‌, ఐడీఎఫ్‌సీఎల్‌, కేఎన్నార్‌  కన్‌స్ట్రక్షన్స్‌, జుబ్లియంట్‌ లైఫ్‌ సైన్స్‌, జేకే టైర్స్‌ లాభాల్లో ఉండగా.. బీహెచ్‌ఈఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఆర్తీ ఇండస్ట్రీస్‌, బంధన్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

చైనాలో కరోనావైరస్‌ రెండోసారి విజృంభిస్తుండటంతో ఆ భయాలు మార్కెట్‌ను కమ్మేశాయి. దీనికి తోడు భారత్‌లో  కీలకమైన దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్‌ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో వైరస్‌ విజృంభణ ఆగకపోవడంతో ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతుందనే భయాలున్నాయి. మరోపక్క ఆసియా మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లు దెబ్బతినడంతో విక్రయాలకు పాల్పడుతున్నారు. అమెరికా-చైనా మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ప్రముఖ సూచీలపై పడుతోంది. రిలయన్స్‌, టాటా మోటార్స్‌, బీహెచ్‌ఈఎల్‌ వంటి భారీ షేర్ల నష్టపోవడం కూడా సూచీలను కుంగదీసింది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని