close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120035175 [video_srlno] => 1 [video_type] => 2 [video_link] => https://www.facebook.com/ETVAndhraPradesh/videos/2596823393928371 [video_short_link] => https://www.facebook.com/ETVAndhraPradesh/videos/2596823393928371 [created_by] => [created_date] => [modified_by] => 9030304 [modified_date] => 2020-03-13 17:08:56.245361 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 13/03/2020 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్టాక్‌మార్కెట్‌.. పతనాల నుంచి కాస్త పైకి..

ముంబయి: కరోనా వైరస్‌ ప్రభావంతో గురువారం భారీ నష్టాలను చవి చూసిన దేశీయ మార్కెట్లు ఎట్టకేలకు లాభపడ్డాయి. నిన్నటి పతనాన్ని కొనసాగిస్తూ ఉదయం ఆరంభ ట్రేడింగ్‌లో భారీనష్టాలను చవి చూడటంతో ఏకంగా ట్రేడింగ్‌ను కొద్దిసేపు ఆపేశారు. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకున్న సూచీలు చివరకు లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,325.34 పాయింట్ల లాభంతో 34,103.48 వద్దకు చేరగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 365 పాయింట్ల లాభంతో 9,955వద్ద స్థిరపడింది. 

45 నిమిషాల పాటు నిలిచిన ట్రేడింగ్‌

నిన్నటి భయాలకు కోలుకోని మార్కెట్లు ట్రేడింగ్‌ ప్రారంభంకాగానే మరింత నష్టాల్లోకి వెళ్లిపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 3,200 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ కూడా 966 పాయింట్ల నష్టంతో ఏకంగా 8,624 పాయింట్లకు పతనమైంది. దీంతో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడింగ్‌ను 45నిమిషాల పాటు నిలిపివేశారు. కరోనా భయం కారణంగా దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. సెబీ నిబంధనల ప్రకారం 10 శాతం సర్క్యూట్‌ బ్రేక్‌ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు భారత్‌లో తొలిసారి కరోనా మరణం సంభవించడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బ తీసింది. వైరస్‌ సమస్య తీవ్రమైపోతుందనే ఆందోళన కూడా సూచీలను పడేసింది. మార్కెట్లకు ఇది వారాంతం కావడం శని, ఆదివారం విరామం తీసుకొని మళ్లీ సోమవారం మొదలవుతాయి. కరోనా వైరస్‌ విషయంలో వేగంగా పరిణామాలు సంభవిస్తుండటంతో ఈ రెండ్రోజుల్లో ఏమైనా జరిగితే  తాము సోమవారం నాటి ట్రేడింగ్‌లో నష్టపోతామని భయంతో మదుపరులు స్టాక్స్‌ను అమ్మేశారు. 

వెంటనే ఊపందుకున్న కొనుగోళ్లు

ట్రేడింగ్‌ పునః ప్రారంభమైన తర్వాత మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. మార్కెట్లు భారీగా పతనమైన నేపథ్యంలో షేర్లు కొనడానికి ఇదే సరైన సమయమని భావించిన మదుపరులు మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. దీంతో నష్టాల నుంచి నెమ్మదిగా కోలుకున్న సూచీలు లాభాల బాట పట్టాయి. చివరకు సెన్సెక్స్‌ 1,325 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 365 పాయింట్ల లాభంతో 9,955 వద్ద ముగిసింది. అత్యధిక షేర్లు లాభాల బాటపట్టాయి. ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్‌, సన్‌ ఫార్మా తదితర షేర్లు లాభపడగా, యూపీఎల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, నెస్లే, ఏషియన్‌ పెయింట్స్‌, బ్రిటానియా తదితర షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.73.90గా ఉంది.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.