
తాజా వార్తలు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ సూచీ 40వేల మార్కును దిగజారడం గమనార్హం. మార్కెట్లు ముగిసే సమాయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 143 పాయింట్లు నష్టపోయి 39,745 వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 11,633 వద్ద ముగిసింది. యూఎస్ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.62 వద్ద కొనసాగుతోంది. కరోనా భయాలు ఇంకా అంతర్జాతీయ మార్కెట్లను వెంటాడుతుండటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కొనసాగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నిఫ్టీలో సన్ ఫార్మా, భారతీ ఇన్ఫ్రాటెల్, టైటాన్, గ్రాసిమ్, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో పయనించగా.. విప్రో, జేఎస్డబ్ల్యూ స్టీల్, జీ ఎంటర్టైన్మెంట్, ఓఎన్జీసీ, ఐఓసీఎల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
Tags :
జిల్లా వార్తలు