close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 14/06/2020 19:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.78,127 కోట్లు ఆవిరి..!  

న్యూదిల్లీ: దేశంలోని అత్యంత విలువైన తొలి 10 సంస్థల్లో  ఏడు సంస్థలు గత వారం ట్రేడింగ్‌లో భారీగా విలువను కోల్పోయాయి. ఈ కోల్పోయిన మొత్తం రూ.78,127 కోట్లు. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు విలువ అత్యధికంగా తగ్గింది. తొలి పది సంస్థల్లో కేవలం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, హెచ్‌డీఎఫ్‌సీ మాత్రమే లభ్దిపొందాయి. 

> హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 28,391 కోట్ల మేరకు మార్కెట్‌ విలువను కోల్పోయి.. రూ.5,39,305.38 కోట్లకు చేరింది. 

> భారతీ ఎయిర్‌టెల్‌ రూ.13,638.89 కోట్లు విలువ కోల్పోయి.. రూ.3,05,456.66 కోట్లకు చేరింది. 

> కోటక్‌ మహీంద్రా రూ.11,882.72 కోట్లు విలువ  కోల్పోయి.. 2,53,197.91 కోట్లను చేరింది. 

>  ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.8,411.45 కోట్లు విలువ తగ్గి.. 2,22,918 కోట్లకు చేరింది. 

> ఐటీసీ రూ.7,313 కోట్ల మేరకు విలువ కోల్పోయింది. దీంతో గత వారం మార్కెట్‌ ముగిసేనాటికి 2,38,469 కోట్లకు చేరింది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.