
తాజా వార్తలు
ముంబయి ఇలాగే కొనసాగితే అంతే సంగతి!
భవిష్యత్‌లోనూ ఓడించడం కష్టం: షేన్‌వాట్సన్
ఇంటర్నెట్‌డెస్క్: ముంబయి జట్టు కొన్నేళ్ల పాటు ఇదే ఆటగాళ్లతో కొనసాగితే భవిష్యత్‌లోనూ ఓడించడం కష్టమని చెన్నై మాజీ బ్యాట్స్‌మన్ షేన్‌వాట్సన్ అభిప్రాయపడ్డాడు. తాజాగా దిల్లీని ఓడించిన ముంబయి 13వ సీజన్లోనూ విజేతగా నిలిచి ఐదోసారి కప్పు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టును అభినందిస్తూ వాట్సన్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు. ఈ సీజన్లో రోహిత్ సేన అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని, ఆ జట్టును వేలెత్తి చూపడానికి ఏమీ లేదని పేర్కొన్నాడు. ఈ సీజన్లో ఆడినన్ని రోజులూ ఆ జట్టు మెరుగవుతూనే ఉందన్నాడు.
‘ముంబయి జట్టుకు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ లాంటి ప్రపంచ శ్రేణి ఓపెనర్లు ఉన్నారు. తర్వాత సూర్యకుమార్ యాదవ్. అతడు నిలకడగా రాణిస్తున్నాడు. త్వరలోనే టీమ్ఇండియాలో ఆడే అవకాశం ఉంది. అతడికి ఈ సీజన్ మంచిగా మిగిలిపోతుంది. ఇక ఇషాన్ కిషన్ తన వంతు పాత్ర పోషించాడు. రోహిత్ లేనపపుడు ఓపెనర్‌గా ఆడినా, అవసరాన్ని బట్టి మిడిల్ ఆర్డర్లో బరిలోకి దిగినా అద్భుతంగా రాణించాడు. ఆపై హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ లాంటి అత్యుత్తమ ఫినీషర్లు ఉండడంతో ఆ జట్టు బలంగా ఉంది. వీరందరినీ పరిగణలోకి తీసుకుంటే ముంబయిని ఓడించడం కష్టతరం. మరికొన్నేళ్లు ఇదే జట్టుతో కొనసాగితే భవిష్యత్‌లో ఇంకా ప్రమాదకరంగా మారుతుంది’ అని వాట్సన్ వివరించాడు. కాగా, ఈ ఏడాది చెన్నై తరఫున చివరిసారి బరిలోకి దిగిన ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ మొత్తం 11 మ్యాచ్‌ల్లో 299 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధశతకాలు నమోదు చేశాడు. ఇక ఈ టీ20 లీగ్ మొత్తంలో 145 మ్యాచ్‌లు ఆడగా 3,874 పరుగులు చేశాడు. అందులో నాలుగు శతకాలు, 21 అర్ధశతకాలు ఉన్నాయి.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కన్నీటి పర్యంతమైన మోదీ
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
