close

తాజా వార్తలు

Updated : 29/10/2020 20:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సచివాలయ నిర్మాణపనులు షాపూర్‌జీ పల్లోంజీకే

అధికారికంగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌: తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణ పనులను షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. నిర్మాణ సంస్థను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఈ-బిడ్డింగ్‌ ద్వారా టెండర్లు ఆహ్వానించగా ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. రూ.494 కోట్లకు టెండర్‌ ఆహ్వానించగా.. షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ 4 శాతం.. ఎల్‌అండ్‌టీ 4.8 శాతం ఎక్కువగా కోట్‌ చేశాయి. బుధవారం సమావేశమైన కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌(సీవోటీ) టెండర్‌ పత్రాలను అధ్యయనం చేయగా షాపూర్‌జీ పల్లోంజీ ఎల్‌-1గా నిలిచింది. దీంతో ఎల్‌-1గా నిలిచిన షాపూర్‌జీ పల్లోంజీ సంస్థకు తాజాగా ఆర్‌అండ్‌బీ అధికారులు సచివాలయం నిర్మాణానికి సంబంధించిన అంగీకార పత్రం అందించారు. సుమారు ఏడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ భవన సముదాయాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం షరతు పెట్టింది.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.