‘ఆ చర్యలతో శివసేనకు సంబంధం లేదు’
close

తాజా వార్తలు

Published : 10/09/2020 17:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆ చర్యలతో శివసేనకు సంబంధం లేదు’

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ కార్యాలయం కూల్చివేతపై తమకేం సంబంధం లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ అన్నారు. గురువారం కొందరు విలేకరులు ప్రశ్నించగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ‘ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులే కంగన రనౌత్‌ కార్యాలయంపై చర్యలు తీసుకున్నారు. అక్కడ తీసుకున్న చర్యలకు శివసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా సమాచారం కావాలంటే బీఎంసీ మేయర్‌ లేదా కమిషనర్‌ను అడగండి’అని ఆయన మీడియాకు బదులిచ్చారు. 

ఇదే విషయమై బుధవారం కూడా స్పందించిన సంజయ్‌.. ‘నేను కంగనను ఎప్పుడూ బెదిరించలేదు. కేవలం ముంబయిపై ఆమె చేసిన వ్యాఖ్యలపై మాత్రమే నేను ఆగ్రహానికి గురయ్యాను. బీఎంసీ తీసుకున్న చర్యలకు నాకు ఎలాంటి సంబంధం లేదు’ అన్నారు.

శివసేనకు, కంగన రనౌత్‌కు మధ్య గత కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబయిలోని కంగన కార్యాలయంలో అక్రమ నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ బీఎంసీ అధికారులు కూల్చడంతో వీరి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. దీంతో కంగన ట్విటర్‌ వేదికగా ముంబయిపై, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై పలు విమర్శలు చేశారు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని