close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 29/06/2020 14:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హఫీజ్‌ అలా చేయాల్సింది కాదు: అక్తర్‌

పీసీబీ రెండోసారి పరీక్షల్లోనూ అతడికి నెగిటివ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ క్రికెటర్‌ మహ్మద్‌ హఫీజ్‌ ప్రైవేటుగా చేసుకున్న కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా రావడంతో దాన్ని సామాజిక మాధ్యమాల్లో వ్యక్తపర్చడం సరికాదని మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు గతవారం పాక్‌ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో పది మంది ఆటగాళ్లకు వైరస్‌ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అందులో హఫీజ్‌ ఒకడు. తర్వాత ప్రైవేటుగా పరీక్షలు చేయించుకోగా తనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా నెగిటివ్‌గా వచ్చిందని ట్విటర్‌లో వెల్లడించాడు. ఈ విషయంపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డు అనుమతి లేకుండా అలా చేయడం తప్పని మందలించింది. ఈ నేపథ్యంలో స్పందించిన అక్తర్‌ యూట్యూబ్‌లో మాట్లాడుతూ హఫీజ్‌ పీసీబీకి వ్యతిరేకంగా వ్యవహరించాల్సింది కాదన్నాడు. 

‘ఆటగాళ్ల పరీక్షల వ్యవహారంలో పీసీబీ కొంచెం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడిప్పుడే పాక్‌ క్రికెటర్లకు ర్యాండమ్‌ పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. దాంతో కొందరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైరస్‌ వ్యాప్తి లాహోర్‌, కరాచీల్లో అధికంగా ఉంది. పరీక్షలు ఇలాగే కొనసాగిస్తే మరిన్ని పాజిటివ్‌ కేసులు వస్తాయి. ఇప్పుడు ఆటగాళ్లకు పరీక్షలు చేశారు. నేనైతే హఫీజ్‌ను మరోసారి పరీక్షలు చేసుకోమని సూచిస్తున్నా. అయితే, ఇంతకుముందు ప్రైవేట్‌గా చేసుకున్న ఫలితాన్ని ట్విటర్‌లో వెల్లడించాల్సింది కాదు. అతడు నేరుగా పీసీబీని సంప్రదించాల్సింది. బోర్డుతో అలా తప్పుగా వ్యవహరించకూడదు. పాకిస్థాన్‌కు ఇంగ్లాండ్‌ పర్యటన ఎంతో ముఖ్యం. మనం అక్కడ టెస్టు సిరీస్‌ గెలవాలంటే మంచి జట్టును పంపించాల్సి ఉంది’ అని అక్తర్‌ వివరించాడు. ఇదిలా ఉండగా, పీసీబీ నిర్వహించిన రెండోసారి పరీక్షల్లో ఆ పది మందిలో ఆరుగురికి నెగటివ్‌గా రావడం గమనార్హం. వారిలో హఫీజ్‌ కూడా ఉండటం విశేషం. అయితే, ఈ పది మంది ఆటగాళ్లను పాక్‌ బోర్డు ఆదివారం ఇంగ్లాండ్‌కు అనుమతించలేదు. ఇంకోసారి పరీక్షలు చేశాక నెగిటివ్‌గా వస్తే అప్పుడు వీరిని ఇంగ్లాండ్‌కు పంపించే అవకాశం ఉంది. 

రెండోసారి నెగిటివ్‌గా వచ్చిన ఆటగాళ్లు:
ఫఖర్‌ జమాన్‌, మహ్మద్‌ హస్నేన్‌, మహ్మద్‌ హఫీజ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, షాదబ్‌ ఖాన్‌, వాహబ్‌ రియాజ్‌.

రెండోసారి కూడా పాజిటివ్‌గా వచ్చిన ఆటగాళ్లు:
హైదర్‌ అలీ, హారిస్‌ రావుఫ్‌, కషిఫ్‌ భట్టి, ఇమ్రాన్‌ఖాన్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.