షాకింగ్‌ వీడియో: మృతదేహంపై శునకం దాడి
close

తాజా వార్తలు

Updated : 28/11/2020 06:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షాకింగ్‌ వీడియో: మృతదేహంపై శునకం దాడి

సంభాల్‌: ఓ వీధి కుక్క ప్రభుత్వాస్పత్రిలో ఉన్న మృతదేహాన్ని తినేందుకు ప్రయత్నించిన ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇక్కడి సంభాల్‌ జిల్లాలో గురువారం సంభవించిన ఈ సంఘటనపై.. ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి.

రోడ్డు ప్రమాదానికి గురైన ఓ చిన్నారిని ఇక్కడి ప్రభుత్వాస్పత్రికి  తీసుకువచ్చారు. అయితే ఆ బాలిక చికిత్స పొందుతూ మరణించింది. తెల్లని గుడ్డలో చుట్టి ఉన్న ఆ మృతదేహాన్ని ఆస్పత్రిలో ఓ మూల స్ట్రెచర్‌పై ఉంచారు. కాగా, దానిని ఓ కుక్క పీక్కు తినడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. 20 సెకన్ల పాటు సాగే ఈ వీడియోను సమాజ్‌వాదీ పార్టీ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. చిన్నారి కుటుంబానికి సంతాపం తెలియచేస్తూ.. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది.

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరి పట్ల మృతురాలి కుటుంబీకులు నిరసన వ్యక్తం చేశారు. ఆ రోజు అనేక మరణాలు సంభవించటంతో.. సిబ్బందిపై పని ఒత్తిడి ఎక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. అంతేకాకుండా ఆ పరిసరాల్లో వీధి కుక్కల సమస్య ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. కాగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరిని సస్పెండ్‌ చేసినట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని