close

తాజా వార్తలు

Updated : 08/11/2020 18:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోహ్లీ కెప్టెన్సీ బెంగళూరుకు ఉపయోగకరం..

అతడితో పనిచేయడం అదృష్టం: సైమన్‌ కటిచ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుసగా 13వ సీజన్‌లోనూ విఫలమైన కోహ్లీసేనపై ఓ వైపు విమర్శలు ఎదురవుతుంటే మరోవైపు ఆ జట్టు కోచ్‌ సైమన్‌ కటిచ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లాంటి ప్రొఫెషనల్‌ ఆటగాడితో కలిసి పనిచేయడం తన అదృష్టమని చెప్పాడు. తాజాగా ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరు.. హైదరాబాద్‌ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్‌లోనూ టైటిల్‌ సాధించాలనే కల నెరవేరలేదు. ఇక శనివారం మీడియాతో మాట్లాడిన కటిచ్‌ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ సీజన్‌లో తమ జట్టు బాగా ఆడిందని, కోహ్లీ సేవలు బెంగళూరుకు అవసరమని పేర్కొన్నాడు. 

‘కోహ్లీతో తొలిసారి పనిచేశాను. ఈ క్రమంలోనే అతడిలో ఒక ప్రొఫెషనల్‌ ప్లేయర్‌ని, ప్రతి ఒక్కరూ గౌరవించే సారథిని చూశాను. అది కేవలం మైదానంలో వ్యవహరించే పరిస్థితుల వల్లనే కాదు.. బయట కూడా వారితో అంత కలివిడిగా ఉండడం వల్లనే సాధ్యమైంది. కోహ్లీతో పాటు అనుష్కశర్మ కూడా ఆటగాళ్లతో కలిసిపోయింది అని సైమన్‌ వివరించాడు. మ్యాచ్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కెప్టెన్‌ తన ఆటతీరుతో మిగతా 10 మందికి స్ఫూర్తి కలిగిస్తాడని చెప్పాడు. ఇక చివరి వరకూ పోరాడటం అనేది బెంగళూరుకే చెల్లిందని, హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ పోరాడినట్లు గుర్తుచేశాడు. దాంతో తమ జట్టు పట్ల గర్వాంగా ఉందని, ఈ విషయంలో కెప్డెన్‌ కోహ్లీని మెచ్చుకోవాలని చెప్పాడు. అలాగే యువ క్రికెటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ రాణించడానికి గల కారణం కోహ్లీనేనని, ఈసారి తమ జట్టులో సీనియర్లను జూనియర్లకు మెంటార్‌గా నియమించడం వల్ల సరైన ఫలితం వచ్చిందని చెప్పాడు. కోహ్లీతో కలిసి సాధన చేయడం దేవ్‌దత్‌ కెరీర్‌కు ఉపయోగమని సైమన్‌ వివరించాడు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని