
తాజా వార్తలు
చేతులు దగ్గరికి వస్తున్నాయా?
‘ఫేస్ టచ్ కాషన్ అలారమ్’ రూపకల్పన
సిరిసిల్ల : కరోనాను నివారించేందుకు సిరిసిల్లకు చెందిన స్నేహ వినూత్నంగా చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. కరోనా వైరస్ చేతుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ‘ఫేస్ టచ్ కాషన్ అలారమ్’ను రూపొందించింది. చేతులతో ముక్కు, కళ్లు, నోరు తాకకూడదనే వైద్యుల సూచన మేరకు ఈ పరికరాన్ని తీర్చిదిద్దినట్టు తెలిపింది. మనకు తెలియకుండానే చేతులు ముఖ భాగాలను తాకేందుకు వచ్చినప్పుడు, ఇతరులతో చేతులు కలిపే ప్రయత్నం చేసినప్పడు వెంటనే ఈ ‘ఫేస్ టచ్ కాషన్ అలారమ్’ మోగి అప్రమత్తం చేస్తుంది.
Tags :