close

తాజా వార్తలు

Updated : 22/10/2020 16:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వదంతులు నమ్మొద్దు.. స్థిరంగా నాన్న ఆరోగ్యం!

రాజశేఖర్‌ ఆరోగ్యంపై శివాత్మిక ట్వీట్‌

హైదరాబాద్‌: రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా వస్తోన్న వదంతులు నమ్మొద్దని ఆయన చిన్న కుమార్తె శివాత్మిక ట్వీట్‌ చేశారు. కొన్నిరోజులుగా రాజశేఖర్‌ కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం శివాత్మిక తన తండ్రి ఆరోగ్యం గురించి అందరికీ తెలియజేస్తూ కొన్ని ట్వీట్లు పెట్టారు.

‘కొవిడ్‌ నుంచి కోలుకునేందుకు నాన్న పోరాటం చేస్తున్నారు. మీ అభిమానం, ప్రార్థనలు, ఆశీస్సులే.. మమ్మల్ని రక్షిస్తున్నాయని నమ్ముతున్నాం. కరోనా నుంచి నాన్న వేగంగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రార్థనలతో ఆయన కోలుకుని తిరిగి వస్తారు’ అని తొలుత శివాత్మిక ట్వీట్‌ చేశారు.

కాగా, ఆమె చేసిన ట్వీట్‌ చూసి నెటిజన్లు కంగారుపడ్డారు. దీంతో ఆమె వెంటనే మరో ట్వీట్‌ చేస్తూ.. ‘మీరు చేస్తున్న ప్రార్థనలకు ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా లేదు. స్థిరంగా ఉంది. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీ ప్రార్థనలు మాకు కావాలి. థ్యాంక్యూ. భయపడకండి.  అవాస్తవాలను ప్రచారం చేయకండి’ అని పేర్కొన్నారు. తన కుటుంబమంతా కొవిడ్‌-19 బారినపడిందని తెలియజేస్తూ ఈ నెల 17న రాజశేఖర్‌ ఓ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. 




Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని