
తాజా వార్తలు
జింకను హతమార్చిన కేసులో ఆరుగురి అరెస్టు
అశ్వారావుపేట (భద్రాద్రికొత్తగూడెం): అశ్వారావుపేట మండలం మద్దికొండ గ్రామంలోకి అడవి నుంచి వచ్చిన ఓ జింకను శుక్రవారం తెల్లవారుజామున కొంతమంది గ్రామస్థులు పట్టుకున్నారు. ఓ ఇంటిలో బంధించి చంపేశారు. దాని మాంసం, చర్మాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా.. ఇన్ఛార్జి రేంజర్ రెహ్మాన్ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది వారిని పట్టుకున్నారు. దీనికి కారణమైన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారిపై వణ్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఇన్ఛార్జి రేంజర్ తెలిపారు.
Tags :