close

తాజా వార్తలు

Published : 30/10/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రజలపై రూ.60వేల కోట్ల భారం: చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర గడవకుండానే ప్రజలపై రూ.60వేల కోట్ల భారం మోపిందని తెలుగుదేశం పార్టీ (తెదేపా) అధినేత చంద్రబాబు విమర్శించారు. కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ నేతలలో గురువారం సమీక్ష నిర్వహించిన ఆయన వైకాపా ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైకాపా పాలనలో ఆర్థిక అసమానతలు పెరిగాయన్నారు. ప్రజల ఆదాయం తగ్గిపోయిందని, లక్షలాది మంది పేదలకు సంక్షేమాన్ని దూరం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విచ్ఛిన్నం చేశారని దుయ్యబట్టారు. తెదేపాపై ప్రతీకారంతో ప్రజలమీద కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

తెదేపా ఐదేళ్లలో కర్నూలు అభివృద్ధికి ఎనలేని కృషి చేసిందని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ఏడాదిన్నరవుతున్నా కర్నూలులో అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం చేసింది శూన్యమని విమర్శించారు. గతంలో తెదేపా చేపట్టిన అభివృద్ధి పనులన్నీ నిలిపివేశారని మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.




Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని