సోషల్‌ లుక్‌: నాని ‘నాన్న’.. సల్మాన్‌ ‘భూమి’ తల్లి
close

తాజా వార్తలు

Published : 11/12/2020 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: నాని ‘నాన్న’.. సల్మాన్‌ ‘భూమి’ తల్లి

తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా ప్రారంభోత్సవాలు.. వివాహ వార్షికోత్సవాలు.. పోస్టర్లు.. ట్రైలర్లు.. ఇలా సోషల్‌ మీడియాలో సినిమా తారలు ఈ రోజు సందడి చేశారు. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ మాత్రం నా రూటే సెపరేటు అంటూ వ్యవసాయం బాటపట్టాడు. ఇలా సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులకు మరింత చేరువగా ఉంటున్నారు. మరి ఈరోజు ఇంకా ఎవరెవరు ఏయే పోస్టులు చేశారో చూసేద్దామా..!

* బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. ‘భూమి తల్లి’ అంటూ తాను పొలంలో పనులు చేస్తున్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

* ఈరోజు ‘కేజీఎఫ్‌’ హీరో యశ్‌ పెళ్లిరోజు. ఈ సందర్భంగా అతని భార్య రాధికాపండిట్‌ వాళ్లిద్దరి ఫొటోను పంచుకుంది.

* బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌ కెరీర్‌లో ఈ రోజు ఓ మైలు రాయిని చేరుకున్నాడు. ఆయన సినీ కెరీర్‌ ప్రారంభమై 10వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా థియేటర్‌లో నిల్చొని ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు.

* నాని కొత్త సినిమా ‘శ్యామ్‌సింగరాయ్‌’ ప్రారంభమైంది. నాని తండ్రి గంటా రాంబాబు స్వయంగా క్లాప్‌ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు.

* సమంతకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 14మిలియన్లకు చేరుకుంది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో ప్రకటించింది.

ఇదీ చదవండి..

ఆ సమయంలో నా చేతులు వణికిపోయాయి!

 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని