close
Array ( ) 1

తాజా వార్తలు

కొందరు ఇంకా మంత్రులుగానే ప్రవర్తిస్తున్నారు..!

జైరాం రమేశ్‌ వ్యాఖ్యలు

దిల్లీ: ఇటీవల జరిగిన దిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై కాంగ్రెస్‌ ముఖ్య నేతల్లో అంతర్మథనం మొదలైంది. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటూనే కొత్త పద్ధతుల్లో ప్రజలకు చేరువకావడంపై చర్చిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, జైరాం రమేశ్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. పార్టీలో పూర్తి ప్రక్షాళన జరిగి పునరావిష్కరణ దిశగా వెళ్లాల్సిన అవసరం ఉందని జైరాం రమేశ్‌ అన్నారు. కేంద్రంలో అధికారం కోల్పోయి ఆరేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ తమ పార్టీలో కొందరు నేతలు మంత్రులుగానే ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతలు తమను తాము పునరావిష్కరించుకోవాలని సూచించారు. అహం వీడి కొత్త తరహాలో ప్రజల్లోకి వెళ్లాలన్నారు. పార్టీ నాయకత్వం వ్యవహార శైలి మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దిల్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు కరోనా వైరస్‌లా కోలుకోలేని విపత్తులా పరిణమించాయని వ్యాఖ్యానించారు. స్థానిక నేతలను ఉత్సాహపరుస్తూ వారికి మరింత స్వేచ్ఛనివ్వాలన్నారు. 

కొత్త విధానాలు అవసరం: సింధియా
ఈ ఎన్నికల ఫలితాలు తనకు పూర్తిగా నిరాశ కల్గించాయని, ప్రజల్లోకి కొత్త పద్ధతుల ద్వారా వెళ్లాల్సి ఉందని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఈ ఎన్నికల్లో అపూర్వ విజయం సొంతం చేసుకొని హ్యాట్రిక్‌ సాధించిన ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఆయన అభినందనలు తెలిపారు. కేజ్రీ బృందంపై ప్రజలు మళ్లీ విశ్వాసం ఉంచారని తెలిపారు. కాలం మారింది.. దేశం మారింది.. ఇకపై కాంగ్రెస్‌ కొత్త తరహా విధానాలు అవలంబించాలని అన్నారు. నేతలు కొత్తగా పనిచేయాలన్నారు. లోక్‌సభ ఎన్నికలు తర్వాత కూడా కాంగ్రెస్‌ కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మరోవైపు, కాంగ్రెస్‌ పార్టీలో ఆత్మపరిశీలన కంటే తక్షణ చర్యలు అవసరమని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.